Home » ఆర్ఆర్ఆర్ అప్డేట్…క్లైమాక్స్ లో 40నిమిషాల పాటు ఫైట్…!

ఆర్ఆర్ఆర్ అప్డేట్…క్లైమాక్స్ లో 40నిమిషాల పాటు ఫైట్…!

by AJAY
Ad

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి ముందే విడుదల కావాల్సి ఉంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టింది. కానీ కరోనా కేసులు పెరగడంతో సినిమాను చిత్రయూనిట్ వాయిదా వేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై తాజాగా కొన్ని వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

RRR FIRST RIVEW

RRR 

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ లో ఎంతో ఆకట్టుకునే విధంగా యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ లో ఏకంగా 40 నిమిషాల పాటు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. ఇంటర్వెల్ సమయంలోనూ ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉందట. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ మొత్తం కూడా యాక్షన్ సన్నివేశాలతో నిండిపోతుందట.

Advertisement

అయితే బాహుబలి సినిమాలోనూ ఇదే విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోనూ అదే రీతిలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని ఆ సన్నివేశాలు ఆంగ్లేయులకు మన హీరోలు సైన్యానికి మధ్య ఉండబోతున్నాయి అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి జక్కన్న ఏ రేంజ్ లో యాక్షన్ ను సెట్ చేశాడో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading