భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందని…చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా. ఇవాళ విజయవాడ తుమ్మలపల్లిలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరుగగా.. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా కామెంట్స్ చేశారు. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారని… అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. మోడి, అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని.. చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాం లు చేసారని ఆగ్రహించారు మంత్రి రోజా. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ పేరుతో దోచుకున్నారని… ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.
Advertisement
Advertisement
స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు…కాళ్ళ నుండి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్నాడంటూ లోకేష్ పై సెటైర్లు పేల్చారు రోజా. ఎర్రబుక్ లో రాసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్ సీఐడీ మెమోలో ఆయన పేరు రాసారని గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.హెరిటేజ్ లో 2శాతం షేర్లు అమ్మితెనే 400కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు…అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా అని మండిపడ్డారు రోజా. కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారని..అక్కడినుండి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగిందని ఆగ్రహించారు.
ఇవి కూడా చదవండి
- వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం..160 సీట్లు పక్కా – అశ్వినీదత్
- పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఎందుకు ఆలస్యం అయ్యాయి..ఇండియా కావాలనే చేసిందా ?
- హీరోయిన్ రాశి, వేణు మధ్య అలాంటి రిలేషన్ ఉందా..?