ఐపీఎల్ 2022 లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది ఏ జట్టు అంటే అందరూ చెప్పే మొదటి పేరు ముంబై ఇండియన్స్. ఈ ఐపీఎల్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన ముంబై కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఆఖరి 10వ స్థానంలో నిలిచింది. అయితే ఈ జట్టు ఈ సీజన్ లో తమ మొదటి విజయం కోసం 8 మ్యాచ్ లు ఆగాల్సి వచ్చింది. జట్టులో యువ ఆటగాళ్లు రాణిస్తున్న సీనియర్లు అందరూ చేతులెతేశారు. దాంతో జట్టు ఇలా భంగ పడింది.
Advertisement
అయితే తాము చిన్న బ్రేక్ మాత్రమే ఇచ్చాము అని.. ఐపీఎల్ 2023 దద్ధరిల్లిపోతుంది అని అంటున్నాడు ముంబాయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ రోహిత్ మాట్లాడాడు. దానికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. అందులో రోహిత్… ఇది కేవలం ఒక్క చైనా బ్రేక్ మాత్రమే. వచ్చే ఐపీఎల్ లో మీరు ఓ కొత్త ముంబై ఇండియన్స్ జట్టును చూస్తారు. దాని కోసం ఇప్పటి నుండే ప్రిపరేషన్స్ ప్రారంభిస్తున్నాము అని రోహిత్ పేర్కొన్నాడు.
Advertisement
ఈ ఐపీఎల్ లో రోహిత్ బ్యాట్ తో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేలేకపోవడమే అతని పేలవ ప్రదర్శనకు నిదర్శనం. అలాగే బుమ్రా కూడా ఒక్క మ్యాచ్ లో మినహా మిగిలిన మ్యాచ్ లలో పెద్ద ప్రభావం చూపించలేకపోయారు. ఇక సూర్య కుమార్ యాదం మొదట్లో కొన్ని మ్యాచ్ లి గాయం కారణంగా దూరమయ్యాడు. ఆ తర్వాత జట్టులోకి వచ్చి వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపాడు. కానీ మళ్ళీ చివర్లో గాయం కారణంగా ఐపీఎల్ ను వదిలేసాడు. ఇలా సీనియర్ల దెబ్బేతోనే ముంబై ఆఖరున నిలిచింది అనడంలో సందేహమే లేదు.
ఇవి కూడా చదవండి :