Rishabh Panth : టీమిండియా వికెట్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్ లో రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. గతేడాది కారు ప్రమాదంలో గాయపడిన పంత్ చికిత్స తర్వాత కోలుకున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో ఫిట్నెస్ కోసం శ్రమిస్తున్నాడు. 2024లో టీం ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు పంత్ రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్సిడెంట్ కారణంగా వన్డే వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ కోల్పోయిన పంత్ తిరిగి టీమిండియాలో చోటుకోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ రీఎంట్రీ గురించి బీసీసీఐ అధికారిక కీలక వాక్యాలు చేశారు.
పంత్ భారతజట్టులో చేరాలంటే ముందుగా దేశవాళి క్రికెట్ ఆడాలి. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఫిట్నెస్ నిరూపించుకుంటే పంత్ కు జాతీయజట్టులో చోటు దక్కుతుంది. మొదట అతను ఆత్మవిశ్వాసం తెచ్చుకొని దేశవాళీ క్రికెట్ ఆడాలి. అక్కడ తన ఫిట్నెస్ తో పాటు ఫామ్ ను కూడా తెచ్చుకోవాలి. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సిరీస్ అతన్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి తెలిపాడు. ఎన్సీఏలో కఠిన శిక్షణ తీసుకుంటూ శ్రమిస్తున్న పంత్ కచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో టీమిండియాలో చేరతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పంత్ వస్తే టీమిండియా మిడిలార్డర్ బలం అవుతుంది.
Advertisement
Advertisement
పంత్ ఫ్యాన్స్ కూడా అతను త్వరగా జట్టులో చేరాలని భావిస్తున్నారు. ధోని తర్వాత ఇండియన్ కీపర్ లలో బెస్ట్ అనిపించుకున్న పంత్ జట్టులో రీఎంట్రీ ఇస్తే ఎలా ఆడతాడో చూడాలి. అంతర్జాతీయ క్రికెట్లో 30 టెస్టులు, 4 వన్డేలు, 43 టీ20 లు ఆడి మ్యాచ్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పంత్ చివరిసారిగా 2022లో వెస్టిండీస్ సిరీస్లో ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు మరో రెండు నెలల సమయం ఉండడంతో పంత్ దేశవాళి క్రికెట్లో తన ఫిట్నెస్ నిరూపించుకొని మళ్లీ జాతీయ జట్టులో చేరతాడేమో చూడాలి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.