టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాష్మీక మందన ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది. రష్మిక పాన్ ఇండియా సినిమాల్లో సైతం నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆఫర్ లు అందుకుంటోంది. అయితే రష్మిక సొంత ఇండస్ట్రీ కన్నడ నాట మాత్రం వివాదాల్లో నిలుస్తోంది. అంతే కాకుండా శాండల్ వుడ్ లో రష్మిక ను బ్యాన్ చేశారు అనే టాక్ కూడా వినిపించింది. దానికి కారణం రష్మిక ఓ ఇంటర్వ్యూ లో ఓవర్ చేయడమే.
రష్మిక మొదట కన్నడ ఇండస్ట్రీ ద్వారానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రిషబ్ శెట్టి దర్శకత్వం లో వచ్చిన కిరిక్ పార్టీ సినిమా తో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా లో ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. అయితే కాంతార సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరవాత ఓ ఇంటర్వ్యూ లో రష్మిక ను కంతార సినిమా చూశారా అంతే లేదు అంటూ సమాధానం ఇచ్చింది.
Advertisement
Advertisement
అంతే కాకుండా కిరిక్ పార్టీ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ సైగలు చేసింది. అయితే అది కన్నడ ప్రేక్షకుల కు నచ్చలేదు. ఆ తరవాత డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…సమంత , సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ హీరోయిన్ లకు సినిమా లో ఛాన్స్ ఇస్తా అని సోకాల్డ్ హీరోయిన్ లకు అవకాశం ఇవ్వను అని అన్నారు. అంతే కాకుండా కిరిక్ పార్టీ సినిమా విడుదలై నేటితో ఆరేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి..మా సినిమా విడుదలై ఆరేళ్లు అవుతోంది.
మా కోసం మీరు థియేటర్ లో చేసిన సందడి …మీరు వేసిన విజిల్స్ అన్నీ మ చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగం అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అంటూ పేర్కొన్నారు. అయితే సినిమా హీరో మరియు ప్రొడక్షన్ హౌస్ కు రిషబ్ శెట్టి టాగ్ చేశాడు కానీ రష్మిక ను మాత్రం టాగ్ చేయలేదు. దాంతో రష్మిక కు మరోసారి కౌంటర్ ఇచ్చాడని కన్నడ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.