ఐపీఎల్ 2022 లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ లలో ముంగిట్లోనే గెలిచి ప్రస్తుతం 7వ స్థానంలో కొనసాగుతుంది. అయితే ఢిల్లీ, రాజస్థాన్ మధ్యలో చివరిగా జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో నడుముకంటె ఎంతులో వచ్చిన బంతిని కూడా అంపైర్ నో బాల్ గా ఇవ్వకపోవడంతో అభిమానులు, ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యపోయారు.
Advertisement
అయితే ఢిల్లీ జట్టు హెడ్ కోచ్ అయిన రికీ పాంటింగ్ కూడా ఈ ఘటన జరిగిన సమయంలో చాలా నిరాశ చెందారట. ఈ మ్యాచ్ రోజునే పాంటింగ్ తో కలిసి ఉండే కుటుంబ సభ్యులలో ఒక్కరికి కరోనా పాజిటివ్ గా రావడంతో అతను హోటల్ లోనే క్వారంటైన్ లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడే టీవీలో ఈ మ్యాచ్ చూస్తున పాయింటింగ్ కు ఈ ఘటన సమయంలో చాలా కోపం వచ్చిందట.
Advertisement
ఈ విషయాన్ని స్వయంగా అతనే వెల్లడించాడు. నేను కోపంతో 3-4 రిమోట్లు విరగొట్టాను. అలాగే నా దగ్గర ఉన్న బాటిల్స్ ను కూడా పగలగొట్టాను అని చెప్పాడు. అదే విధంగా ఓ హెడ్ కోచ్ గా ఇటువంటి కష్ట సమయంలో నేను జట్టుతో లేకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది అని పాంటింగ్ చెప్పాడు. అయితే పాటింగ్ ఎటువంటి ఆటగాడు అనేది అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకవేళ ఆ సమయంలో అక్కడ పాంటింగ్ ఉంటె ఏం చేసేవాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇవి కూడా చదవండి :
సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?
అతి తక్కువ స్లెడ్జింగ్ జరిగే స్పోర్ట్స్ ఏంటో మీకు తెలుసా…?