సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు ఏపీ మంత్రి పేర్ని నాని తో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ఇష్యూపై ఆర్జివి పేర్నితో చర్చించారు. ఈ చర్చల అనంతరం రాంగోపాల్ వర్మ మీడియా మాట్లాడుతూ….. తాను ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల తరఫున చర్చలకు రాలేదని వ్యాఖ్యానించారు. ఒక ఫిల్మ్ మేకర్ గా తన అభిప్రాయాన్ని మంత్రి పేర్ని నానికి వివరించానని చెప్పారు. టికెట్ల ధరలు పెంచక పోవడం వల్ల వచ్చే సమస్యలను వివరించానని అన్నారు. టికెట్ ధరల తగ్గింపుతో సినిమా క్వాలిటీ తగ్గిపోతుందని చెప్పానని అన్నారు.
Advertisement
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని తాను భావించడం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల సినిమా టికెట్ల విషయంపై ఆర్జివి ఏపీ మంత్రి పేర్ని నాని కి ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. దాంతో మంత్రి పేర్ని నాని చర్చలకు రావాలని ఆర్జీవీని ఆహ్వానించారు. దాంతో నేడు ఆర్జివి మంత్రితో చర్చించారు. మరి ఆర్జీవీ సూచనలు, సలహాల పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Advertisement