రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో పాలిస్తున్నారు. కీలక పోస్టింగ్లకి నిజాయితీ గల అధికారులను తీసుకుంటున్నారు.
Advertisement
దుబారా ఖర్చుల జోలికి వెళ్లకుండా అందర్నీ ఆకట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. సీఎం అయిన తర్వాత సొంత కారునే వాడుతున్నారు. కొత్త కాన్వాయ్ కొనుగోలు పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది బుల్లెట్ ప్రూఫ్ కారు కావాలని అధికారులు చెప్పడంతో ఆయన తన కారుకే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయాలని అన్నారు.
Advertisement
కాన్వాయ్ ల సంఖ్యని తగ్గించాలని కూడా నిర్ణయించారు సీఎం గా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీ పర్యటనకి ఆయన వెళ్లారు ఈ సందర్భంగా ఆయనకి తెలంగాణ భవన్ నుండి భోజనం వచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ ఇంట్లో వంట మనిషికి ఆయన చెప్పారు. ఇలా అయితే నిన్ను పనిలో నుండి తీసియాల్సి ఉంటుందని చెప్పారట.
తన సొంత భోజనమే తింటానని ప్రోటోకాల్ లాంటివి ఏమీ వద్దు అని ఎప్పటిలాగే వంట చేయమని పనిమనిషితో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పాత సాంప్రదాయాన్ని మళ్లీ తెచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంలు మంత్రులు అసెంబ్లీ సమావేశాల సమయంలో జర్నలిస్టులతో మాట్లాడేవారు కాని తెలంగాణ ఏర్పాటయ్యాక కెసిఆర్ చిట్ చాట్ చేయడానికి ఇష్టపడలేదు. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు జర్నలిస్టులో సీఎం మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ మొదలైనది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!