వేములవాడ మాజీ ఎమ్మెల్యే చందమనేని రమేష్ బాబు ని రెండు నెలల క్రితమే సీఎం కేసీఆర్ వేములవాడ టికెట్ ఇవ్వకుండా ఆయనని వ్యవసాయ శాఖకి చీఫ్ అడ్వైజర్ గా పెట్టారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఆరోజే ఇంటెలిజెన్స్ చీఫ్ గా సురేందర్ రెడ్డిని నియమించారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా శేషాద్రిని నియమించారు. ఒక్క కలంపోటుతో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. సీఎస్ శాంతికుమారి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
పదవులు కోల్పోయిన వాళ్ళల్లో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మాజీ సీఎస్‌లు సోమేశ్‌కుమార్, రాజీవ్‌శర్మ, మాజీ డీజీపీ అనురాగ్‌శర్మ, మాజీ సీపీ ఏకే.ఖాన్, రిటైర్డ్ పీసీసీఎఫ్ శోభ, జీఆర్.రెడ్డి ఉన్నట్టు చెప్పారు. చెన్నమనేని రమేశ్‌బాబు ని కేసీఆర్ వ్యవసాయ శాఖకు చీఫ్ ఎడ్వైజర్‌గా నియమించారు. వేములవాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ రావడం తో పదివి ఊడిపోయింది.
Advertisement
రాజీవ్‌శర్మ, సోమేశ్‌కుమార్ ని సలహాదారులుగా కేసీఆర్ పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్లకు పోస్టు లేదు. అలానే తెలంగాణ తొలి డీజీపీగా గుర్తింపు పొందిన అనురాగ్ శర్మ కేసీఆర్‌కు సన్నిహితుడు. ఇప్పుడు ఈయన పోస్టు కూడా ఊడిపోయింది. మాజీ ఐపీఎస్ అధికారి ఏకే.ఖాన్. ఖాన్ రిటైర్ అయ్యాక సలహాదారుగా పెట్టారు కేసీఆర్. కానీ ఇప్పుడు లేదు. అటవీశాఖ సలహాదారు పోస్టు ని కేసీఆర్ ఐఎఫ్ఎస్ అధికారి శోభా కి ఇచ్చారు. కానీ ఇప్పుడు లేదు. కిరణ్ మార్ రెడ్డి కి కూడా ఇదే పరిస్థితి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!