Home » రెండేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నటూ.. క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్…!

రెండేళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నటూ.. క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్…!

by Sravya
Ad

నటి రేణు దేశాయ్ గురించి పరిచయమే అక్కర్లేదు ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వివిధ పోస్టులని చేస్తూ ఉంటారు. రేణు దేశాయ్ అంటే మొట్టమొదట మనకి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమె మనందరికీ సుపరిచితం తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ఆమె స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు లో ఆమె ఒక మంచి పాత్ర చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అప్పట్లో ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న ఈమె సోషల్ మీడియాలో వేదికగా అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించారు.

Advertisement

Advertisement

దీనిపై పవన్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అయితే ఆ తర్వాత రేణు దేశాయ్ కొత్త జీవితాన్ని ప్రారంభించడం గురించి ఎలాంటి సమాచారం కూడా రాలేదు. ఎవరికి తెలియకుండా మేము మళ్ళీ పెళ్లి చేసుకుందామా లేదంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారా ఒంటరిగానే ఉండాలని అనుకున్నారా అనేది తెలియదు. ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఉంది. పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు అది రెండు ఏళ్ళ తర్వాత జరుగుతుంది అని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్.

100% కాదు 1000% నేను పెళ్లి చేసుకుంటాను కాకపోతే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాను అని రేణు దేశాయ్ చెప్పారు. పెళ్లి చేసుకుంటే నా కూతురుతో తగినంత సమయం గడుపుతానో లేదో అనిపించింది. తనకి 16 ఏళ్లు వచ్చి కాలేజీకి వెళ్తే అప్పుడు పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి ఏమీ మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుందనేది నాకు అనుభవం అయిందని, అందుకే ఆయన గురించి ఏమీ మాట్లాడను మొన్న ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఒక వీడియో పెట్టాను నాకు అనిపించింది నేను మాట్లాడేసాను. అక్కడితో అయిపోయింది అంటూ ఈమె చెప్పుకొచ్చారు.

Visitors Are Also Reading