Home » పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన జర్నలిస్ట్ కి రేణు దేశాయ్ ఇచ్చిన కౌంటర్ మాములుగా లేదు !

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన జర్నలిస్ట్ కి రేణు దేశాయ్ ఇచ్చిన కౌంటర్ మాములుగా లేదు !

by Sravya
Ad

రేణు దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్ ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఈమె వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ నుండి ఈమె విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. అయినా కూడా ఏదో ఒక వార్తలో నిలుస్తూ ఉంటుంది రేణు దేశాయ్. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పర్సనల్ విషయాలు గురించి ఎక్కువగా మీడియాలో వార్తలు రావడంతో ఆమె చాలాసార్లు పాలిటిక్స్ లో వ్యక్తిగత విషయాలు తీసుకురావద్దని చెప్పారు.

Advertisement

అయినప్పటికీ రేణు దేశాయ్ ని రాజకీయాల్లో ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాయుట. ఈ క్రమంలోనే ఇంకోసారి సోషల్ మీడియా వేదికగా తన బాధని రేణు దేశాయ్ చెప్పారు రాజకీయాల్లోకి సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు లాగుతున్నారు..? సమాజానికి ఏమైనా నష్టం ఉందా అని అడిగారు.

Advertisement

అలానే అసలు జర్నలిజం అంటే ఏంటి..? అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడుకుంటూ కూర్చుని షో చేయడమా అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. ప్రతిసారి మా వ్యక్తిగత జీవితాన్ని లాగుతున్నారని ఆమె తన ఆవేదనని వ్యక్తపరిచారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సాఫ్ట్ గా ఉంటారని, ఏది పడితే అది మాట్లాడితే ఎవరికైనా సహనం చచ్చిపోతుందని ఆమె కోప్పడ్డారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading