తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వేణు స్వయం వరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరవాత మరి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. కానీ వేణు కు నటుడుగా మంచి గుర్తింపు వచ్చింది. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
Advertisement
కొన్ని సినిమాలు చేసి ఆ తరవాత ఇండస్ట్రీ కి దూరం అయ్యాడు. దాంతో వేణు ను ప్రేక్షకులు చాలా మిస్ అయ్యారు. కాగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా తో వేణు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే వేణు పొలిటికల్ మరియు సినిమా బ్యాగ్రౌండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
సినిమా వాళ్ల తో పాటు రాజకీయాల్లో రాణించిన వాళ్ళు వేణు కు దగ్గరి బంధువులు ఉన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు వేణుకి స్వయానా బావ అవుతారు. వేణు సోదరిని నామా వివాహం చేసుకున్నారు. అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ వేణు కు స్వయానా మేనమామ అవుతాడు. అంతే కాకుండా నటసింహం నందమూరి బాలయ్య సైతం వేణు కు దగ్గరి బంధువు అన్న సంగతి చాలా మందికి తెలియదు. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వేణు కు పెదనాన్న అవుతారు.
కావూరి సాంబశివరావు కూతురు కొడుకు(మనవడు) అయిన మెతుకు మిల్లి శ్రీ భరత్ …బాలకృష్ణ చిన్న కూతురును వివాహం చేసుకున్నారు. అంతే వేణు సోదరి కుమారుడినే బాలయ్య చిన్న కూతురు వివాహం చేసుకుంది. ఆ లెక్కన బాలయ్య వేణు కు అన్నయ్య అవుతాడు. ఇక వేణు కూడా నందమూరి కుటుంబం కు చాలా దగ్గర గా ఉంటాడు. బయట ఫంక్షన్ లలో పెద్దగా కనిపించక పోయినా కూడా ఇంటర్వ్యూ లలో ఎన్టీఆర్ బాలయ్య లను పొగడ్తల తో ముంచెత్తుతూ ఉంటాడు.