ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో హీరోయిన్ రేఖ కూడా ఒకరు. సౌత్ ఇండియా తో పాటు నార్త్ ఇండియాలోను రేఖ అభిమానులను సంపాదించుకున్నారు. రేఖ తమిళనాడుకు చెందినవారు కావడంతో హిందీ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కృషి తో హిందీ నేర్చుకుని బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా రానించారు.
Advertisement
ఇప్పటికీ రేఖ అందంగా ఉంటారంటే యవ్వనంలో ఏ రేంజ్ లో ఉండేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి రేఖ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అందం అభినయంతో రేఖ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లోనూ రేఖ రాణించారు.
Advertisement
రాజ్యసభ సభ్యురాలిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా రేఖ పద్మశ్రీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. మరోవైపు కాంట్రవర్సీలకు సైతం రేఖ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇదిలా ఉండగా హీరోయిన్ రేఖకు మహానటి సావిత్రితో బంధుత్వం ఉంది అన్న సంగతి చాలామందికి తెలియదు. రేఖ తల్లిదండ్రులు ఒకప్పటి స్టార్ హీరో జెమినీ గణేషన్ జెమినీ గణేషన్ తల్లి పుష్పవల్లి… ఇదిలా ఉంటే జెమినీ గణేషన్ మహానటి సావిత్రిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
సీక్రెట్ గా జెమిని గణేషన్ సావిత్రి వివాహం చేసుకున్నారు. కాబట్టి మహానటి సావిత్రి రేఖకు వరసకు పిన్ని అవుతుంది. ఇక రేఖ బాలనటిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి గ్లామర్ హీరోయిన్ గా ఎదిగింది. రేఖ జీవితంలో ఎన్నో మార్పులు ఉన్నాయి. అంతుచిక్కని కోణాలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ వాటన్నింటికీ ఎదిరించి నిలబడుతూ చాలా మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.