స్టార్ హీరోల వారసుల ఎంట్రీ అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను రీచ్ అయ్యేలానే సినిమాలను ప్లాన్ చేస్తారు. కానీ కొన్ని సార్లు అవి బెడిసికొట్టి ఫ్లాప్ అవుతుంటాయి. ఆ తరవాత రెండో సినిమాకో మూడో సినిమాకో హిట్ కొడతారు. కానీ అక్కినేని వారసుడు అఖిల్ మాత్రం ఇప్పటి వరకూ నాలుగు సినిమాల్లో నటించగా అన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ నే మూటగట్టుకున్నాయి. కాగా అఖిల్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
స్టార్ డైరెక్టర్ వివి నాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మాతగా అఖిల్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అఖిల్ డెబ్యూ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుని సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ను రంగంలోకి దింపాడు. దాంతో అఖిల్ రెండో సినిమాగా హలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాటలు ఆకట్టుకున్నాయి. కథ కూడా పర్లేదు కానీ అఖిల్ పర్ఫామెన్స్ పరంగా ఇంకా ఎదగాలని ప్రేక్షకులు భావించారు.
Advertisement
అఖిల్ మూడో సినిమాగా మిస్టర్ మజ్ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ పాతదే అవ్వడం వల్ల ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అయ్యారు.
వరుసగా ఫ్లాప్ లతో హాట్రిక్ కొట్టిన అఖిల్ ఈసారి పక్కా హిట్ కొడతాడని అంతా అనుకున్నారు. నాలుగోసారి కూడా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.