Home » వీర‌సింహారెడ్డి నెగిటివ్ టాక్ కు అస‌లు కార‌ణం అదేనా..?

వీర‌సింహారెడ్డి నెగిటివ్ టాక్ కు అస‌లు కార‌ణం అదేనా..?

by AJAY
Ad

సంక్రాంతికి బాల‌య్య సినిమా అంటే అంచానాలు మామూలుగా ఉండ‌వు. అది కూడా బాల‌య్య చిరు మ‌ధ్య పోటీ అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆరేళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ బాల‌య్య చిరు ఈ యేడాది సంక్రాంతి భరిలో దిగారు. ఇక వీర‌సింహారెడ్డి సినిమా వాల్తేరు వీర‌య్య కంటే ఒక‌రోజు ముందు నేడు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫ్యాన్స్ ఫిదా అయినా కూడా కొంత నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది.

Advertisement

సినిమాలో క‌థ రొటీన్ అని అవే ఫైట్ లు డైలాగులు త‌ప్ప సినిమాలో కొత్త‌ద‌నం లేద‌ని కొంత‌మంది ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతే కాకుండా అస‌లు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ ఎందుకు వ‌స్తుందో ఇప్పుడు చూద్దాం….బాల‌య్య గ‌తంలో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సింహా, లెజెండ్, అఖండ సినిమాల‌లో న‌టించాడు.ఈ సినిమాలు కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి.

Advertisement

అయితే ఈ మూడు సినిమాల‌ను పోలి వీర‌సింహారెడ్డి ఉంద‌ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంద‌ని సెకండ్ ఆఫ్ లో వ‌చ్చే పాత్ర సినిమాను దెబ్బ కొట్టింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

veerasimhareddy-review

అయితే బాల‌య్య గ‌త సినిమాల‌కు కూడా మొద‌ట నెగిటివ్ టాక్ వినిపించింది. కానీ ఆ త‌ర‌వాత పాజిటివ్ టాక్ మొద‌ల‌య్యింది. దాంతో ఆ సినిమాల‌కు క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిసింది. ఇక ఇప్పుడు వీర‌సింహారెడ్డి సినిమాకు కూడా క‌లెక్ష‌న్ ల వ‌ర్షం ప‌క్కా అని బాల‌య్య ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ALSO READ :  “వీర సింహారెడ్డి” సినిమా ప్లస్ లు మైనస్ లు ఇవే….సినిమాకు అదే పెద్ద మైనస్….!

Visitors Are Also Reading