కొన్ని సినిమాలను మొదట భారీ అంచనాల మధ్య ప్రారంభించినప్పటికీ అనేక కారణాల వల్ల అవి మధ్యలోనే ఆగిపోతాయి. అలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో కూడా ఓ సినిమా భారీ అంచనాల నడుమ పట్టాలెక్కి ఆ తరవాత ఆగిపోయింది. పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఖుషి సినిమాను నిర్మించిన శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం ఆ సినిమాను ప్రారంభించారు.
Advertisement
ఆ సినిమా టైటిల్ ను సత్యాగ్రహి గా అనౌన్స్ కూడా చేశారు. అంతే కాకుండా ఆ సినిమాకు అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఓపెనింగ్ షాట్ కూడా తీశారు. దాసరినారాయణరావు క్లాప్ కొట్టగా హీరో విక్టరీ వెంకటేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అంతే కాకుండా దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమా ఫస్ట్ షాట్ తీశారు. అయితే ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు.
Advertisement
సినిమా ఆగిపోవడానికి క్రియేటివ్ డిఫరెన్స్ లు రావడం కారణం అని…స్క్రిప్ట్ సరిగా రాలేదని…బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఇలా రకరకాల కారణాలు అప్పట్లో వినిపించాయి. అయితే ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో అసలు కారణం నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జాని సినిమా ఫ్లాప్ అయిన తరవాత పవన్ కల్యాణ్ చాలా నిరాశ చెందారని చెప్పారు.
తన దర్శకత్వం ప్రేక్షకులను మెప్పించలేదని అందుకే సత్యగ్రహి సినిమా చేసి నిర్మాతల డబ్బులు వేస్ట్ చేయనని పవన్ ఆ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ గారే ఆ సినిమాను ఆపేశారని చెప్పారు. అంతే కాకుండా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ కాలంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలోని పరిస్థితుల ఆధారంగా ఆ సినిమా స్క్రిప్ట్ ను సిద్దం చేశారని చెప్పారు.
ALSO READ: 62 వెడ్స్ 21…ముసలాడే కానీ మహానుభావుడు..!