ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ప్రభాస్ మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. కల్కి సినిమాతో ప్రభాస్ వస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ ఈ మూవీ ని నిర్మిస్తోంది ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గ్లిమ్స్ ని కూడా లాంచ్ చేశారు. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Advertisement
తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటి బాంబేలో జరిగిన టెక్ ఫస్ట్ లో పాల్గొన్నారు ఈ సినిమాకి వాడుతున్న టెక్నాలజీ గురించి చెప్పారు. అలానే టెక్ ఫస్ట్ లో ఆయన పాల్గొని ఈ సినిమాకి సంబంధించిన విషయాలని వివరించారు. కల్కి 2898 AD సినిమాకి సంబంధించి నాగ్ అశ్విన్ ని కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ఈ ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చెప్పారు. కొన్ని టైం ట్రావెల్స్ సినిమాలు వచ్చాయని అయితే కల్కి వాటి అన్నిటికంటే డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగిన కథ అని చెప్పారు.
Advertisement
హాలీవుడ్ ఫ్యూచర్, అక్కడ సిటీలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈ సినిమా అని చెప్పారు. ఈ మూవీ ని కొత్తగా డిజైన్ చేశారట కొత్త ప్రపంచాన్ని నిర్మించామని వివరించారు నాగశ్విన్. ఈ సినిమా కోసం డిజైన్ వర్క్ చేసినట్లు కాన్సెప్ట్ ఆర్టిస్టులు ప్రొడక్షన్ డిజైనర్లతో పాటుగా టీమ్ అంతా కలిసి చాలా ఆలోచించినట్లు చెప్పారు. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు అన్ని కూడా భారతీయ మూలాలలో ముడిపడి ఉన్నట్లు చెప్పారు. మరి కల్కి సినిమాకి 2898 AD అని ఎందుకు పెట్టారు అనే ప్రశ్న ఎదురైతే దీని వెనకాల లాజిక్ ఉందని ఆయన చెప్పారు. అయితే అది సినిమా విడుదల కి దగ్గర పడుతున్న టైం లో చెప్తానని నవ్వుతూ చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!