ఎన్నో అంచనాలతో మొదలైన బిగ్ బాస్ 7 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. ఈ సీజన్ లో అనూహ్య పరిణామాలే చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ సీజన్ లో విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ చాలా వరకు ఆకట్టుకుందని చెప్పవచ్చు. అయితే.. దానికి కారణం మాత్రం అమర్ దీప్ మరియు శివాజీ అని చెప్పవచ్చు. కావలసినంత కంటెంట్ తో పాటు.. బోలెడు ఎంటర్టైన్మెంట్ ను కూడా బిగ్ బాస్ షో పంచింది. అమర్ దీప్, శివాజీ బిగ్ బాస్ షో ని రక్తి కట్టించడంలో కీ రోల్ ప్లే చేసారు. ఎక్కువ ప్రోమోలు కూడా వీరిద్దరి పైనే ఉండేవి.
Advertisement
Advertisement
టాప్ 6 కంటెస్టెంట్స్ లో ప్రియాంక, యావర్, అర్జున్, మరియు శివాజిలు ఎలిమినేట్ అయ్యారు. అమర్, ప్రశాంత్ లు మాత్రం టాప్ 2 గా నిలిచారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారా? అని చివరి వరకు ప్రేక్షకులు ఆసక్తిగానే చూసారు. మొత్తానికి ఆ అవకాశం ప్రశాంత్ ని వరించింది. అయితే.. శివాజీ కూడా ఈ ఆటలో బాగానే ఆడినప్పటికీ.. చివరలో ఎలిమినేట్ అయిపోయారు. అతని అహంకారమే అతని ఓటమికి కారణం అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
సీజన్ మొదటి నుంచి శివాజీని టైటిల్ గెల్చుకుంటాడని అని అందరు అనుకున్నారు. అయితే.. శివాజీ అమర్ దీప్ ను ఎక్కువగా కార్నర్ చేయడం వలన కూడా నెగటివ్ ఇంప్రెషన్ వచ్చిందని.. శివాజీ ఎలిమినేట్ అవడానికి అది కూడా ఓ కారణం అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చివరి ఎపిసోడ్స్ వచ్చేసరికి శివాజీ అమర్ దీప్ పై చేసిన కొన్ని కామెంట్స్ ప్రేక్షకులకు కోపం తెప్పించే విధంగా ఉన్నాయి. అటువంటి ప్రవర్తనని ఆడియన్స్ తీసుకోలేకపోయారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!