నటుడిగా…ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే పౌరాణిక పాత్రలే ఎక్కువగా గుర్తుకు వచ్చేవి. రాముడు…కృష్ణుడు లాంటి పాత్రల్లో నటించాలంటే ఎన్టీఆర్ తరవాతనే మరెవరైనా అని చెప్పాలి. అంతే కాకుండా అప్పట్లో ఎన్టీఆర్ ఫోటోలనే నిజమైన రామడు అనుకుని పూజించినవాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 1961లో దక్షయజ్ఞం అనే సినిమాలో నటించారు.
Advertisement
ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటి సారి శివుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రం 50 రోజుల ఫంక్షన్ ను విజయవాడలోని దుర్గాకళామందిరం హాలు వద్ద నిర్వహించారు. కానీ ఈ సినిమా తరవాత మళ్లీ ఎన్టీఆర్ శివుడి పాత్రలో నటించలేదు. దానికి ఓ కారణం కూడా ఉంది. ఈ సినిమా తరవాత వెంటనే ఎన్టీఆర్ చెన్నైకి బయలుదేరారు. అంతలోనే ఎన్టీఆర్ ఓ చేదు వార్తను విన్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణించారని ఎన్టీఆర్ కు సమాచారం అందింది.
Advertisement
ఈ ఘటనతో ఎన్టీఆర్ షాక్ లోకి వెళ్లిపోయారు. అయితే ఈ విషాదం తరవాత కొంతకాలానికి ఎన్టీఆర్ వద్దకు దర్శకుడు విఠలాచార్య వచ్చారు. విఠలాచార్యతో పాటూ ఓ జోతిష్యుడు కూడా ఎన్టీఆర్ ను చూసేందుకు వచ్చాడు. విఠలాచార్య ఎన్టీఆర్ తో పలు సినిమాలు చేసి హిట్లు ఇచ్చాడు. దాంతో ఎన్టీఆర్ విఠలాచార్య మధ్య మంచి సంబంధాలు ఉండేవి.
అయితే ఎన్టీఆర్ ను కలిసిన సమయంలో విఠలాచార్య వెంట వచ్చిన జోతిష్యుడు మీరు శివుడి పాత్రలో నటించడం వల్లనే పెద్దకుమారుడు మరణించాడని చెబుతాడు. అంతే కాకుండా మీరు జీవితంలో ఎప్పుడూ మళ్లీ శివుడి పాత్రలో నటించవద్దని ఎన్టీఆర్ కు చెబుతాడు. మొదట్లో ఎన్టీఆర్ ఆ విషయాన్ని ఖండిస్తాడు…కానీ విఠలాచార్య పదే పదే శివుడి పాత్రలో నటించవద్దని జోతిష్యం గొప్పతనాన్ని చెప్పడంతో ఎన్టీఆర్ మళ్లీ ఆ పాత్ర చేయలేదు. అంతేకాకుండా భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్లు వచ్చినా ఎన్టీఆర్ వాటిని తిరస్కరించాడు.