తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్రవేసుకున్న నటుడు ఎన్టీరామారావు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఎన్టీఆర్ అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాముడు, కృష్ణుడు పాత్రలలో నటించి నిజంగా దేవుళ్లే దిగివచ్చారా అని మైమరపించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ రాణించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.
ALSO READ : ‘మగధీర’ లో ‘బంగారు కోడి పెట్ట’ పాటచూసి ఎస్పీ బాలు అలా అన్నారట..!
Advertisement
ఎన్నో పథకాల ద్వారా ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాలలో స్థానం సంపాదికోగా ఇప్పటికీ ఆయన తీసుకువచ్చిన కొన్ని పథకాలను పేరు మార్చి అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ మొదటిసారి తిరుపతిలో జరిగిన ఓ సినిమా అవార్డ్ ఫంక్షన్ కు కాషాయం దుస్తులు ధరించి వచ్చారు. దాంతో ఎన్టీఆర్ గెటప్ చూసి ఫంక్షన్ కు వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ గెటప్ చూసి కొంతమంది అప్పుడే అడగాలని కూడా అనుకున్నారు.
Advertisement
కానీ అంత ధైర్యం చేయలేకపోయారు. ఫంక్షన్ పూర్తయిన తరవాత మీడియా ప్రథినిధులు ఎన్టీఆర్ వెంటపడి కాషాయం ధరించడానికి కారణాలు అడిగారు. దాంతో ఎన్టీఆర్….కాషానికి మారడాన్ని సన్యసించడం అని అభివర్ణించారు. ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడకూడదని నిర్ణయించుకున్నా అని అందుకే ఈ గెటప్ అని చెప్పారు. ముక్కుపచ్చలారని చిన్నారిని చెరిచిన ఘటన తనను కలచివేసిందని జీవితం పట్ల విరక్తి పుట్టిందని వ్యాఖ్యానించారు.
అంతే కాకుండా తనను తాను ఎన్టీఆర్ రాజయోగిగా అభివర్ణించుకున్నారు. అయితే ఎన్టీఆర్ మానవ హక్కుల ఉద్యమ నేత స్వామి అగ్నివేష్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని కాషాయం ధరించడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. స్వామి అగ్నివేష్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కాషాయం గొప్పతనం తెసుకున్నారట. ఆ తరవాత ఎన్టీఆర్ కూడా కాషాయం ధరించడం మొదలు పెట్టారు. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్ ను డ్రామారావు అంటూ విమర్శించినా ఆయన పట్టించుకోలేదట.