ఇండియాలోని టాప్ డైరెక్టర్ల ల లిస్ట్ తీస్తే అందులో రాజమౌళి ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రస్తుతం రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఆయన రీసెంట్ గా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
దాంతో సినిమాకు భారీగా కలెక్షన్ లు వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమాకు విదేశాల్లోనూ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా ద్వారా ఫారెన్ ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలను ఇచ్చారు. ఇక రాజమౌళి ఈ స్థాయిలో ఉండగానికి ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా ఒక కారణం అన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సీరియల్ దగ్గర నుండి మొన్నటి ఆర్ఆర్ఆర్ సినిమా వరకూ అన్ని సినిమాలకు విజయేంద్రప్రసాద్ గారే కథలను అందించారు.
Advertisement
విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా సక్సెస్ అవ్వలేకపోయినా ప్రస్తుతం దేశంలోనే స్టార్ రైటర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమ కుంటుంబంలో కులం మతం పట్టింపులు ఉండవని అన్నారు. తన భార్య ఏ కులానికి చెందినవారో కూడా తనకు తెలియని అన్నారు.
అయితే చిరంజీవి హీరోగా నటించిన ఖైధీ సినిమా విడుదలైన సమయంలో తమ మధ్యన ఆసక్తికర సంభాషణ జరిగిందన్నారు. ఖైదీ సినిమా చూసి మా చిరంజీవి సినిమా అని చెప్పినట్టు తెలిపారు. మా చిరంజీవి అంటే ఏంటని అడగ్గా….చిరంజీవి కాపులే గా అంటూ సమాధానం ఇచ్చారని అన్నారు. దాంతో తన భార్య కాపు కులానికి చెందినవారని అర్థం అయ్యిందని చెప్పారు.
ALSO READ : చిరంజీవితో విజయశాంతి 20 ఏళ్లుగా ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ? ఆ విషయంలో చిరు…!