చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. రీఎంట్రీ తర్వాత చిరంజీవి కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా విజయంతో మెగాస్టార్ అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు.
Advertisement
ఇక వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ అతిధిగా హాజరయ్యారు. అంతేకాకుండా సినిమాలో నటించిన రవితేజ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ చేసిన కామెంట్ లు రవితేజ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్నాయి.
Advertisement
సినిమాలో రవితేజ పాత్ర గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ…. రవితేజ ను…. రవి అని ఏకవచనం తో సంబోధించాడు. అలా రామ్ చరణ్ రెండు మూడు సార్లు రిపీట్ చేశాడు. దాంతో రాంచరణ్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవితేజ ఫ్యాన్స్ చరణ్ పై మండిపడుతున్నారు.
రవితేజ నీ కంటే 20 ఏళ్లు పెద్దవాడు…. నువ్వు పుట్టకముందే ఇండస్ట్రీకి వచ్చాడు. రవన్న లేదా రవి సార్… రవి గారు అంటూ గౌరవం ఇవ్వడం నేర్చుకో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా రవితేజ చిరంజీవి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే వారి మధ్య ఉన్న క్లోజ్ నెస్ తో రామ్ చరణ్ రవితేజను అలా పిలిచారు అని మెగా ఫ్యాన్స్ కవర్ చేస్తున్నారు.
Also read : కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు…అది ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే….!