ఐపీఎల్ 2022 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవాహరిస్తున్నాడు సంజూ శాంసన్. అయితే ఈ సీజన్ లో కొంచెం నిలకడైన ప్రదర్శన చేస్తూ కెప్టెన్ గా తన జట్టును కూడా ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. కానీ ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ కు మాత్రం సంజూ ను ఎంపిక చేయలేదు. దాంతో సంజూ తీసుకోకపోవడం పై బీసీసీఐ మీద విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా సంజూ టీంఇండియాలోకి రాకపోవడానికి కారణాలు ఇవే అంటూ ప్రకటించాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.
Advertisement
తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. సంజూ మంచి క్రికెటర్. కానీ అతను ఎక్కువగా భారీ షాట్స్ ఆడాలి అనుకుంటాడు. నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కూడా వచ్చిన మొదటి బంతికే సిక్సర్ కొట్టిన సంజూ… అదే ఊపులో 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసాడు. ఆ తర్వాత మరో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. అయితే ఇదే సంజూ సమస్య అని రవిశాస్త్రి అన్నారు. సరైన లైన్ మీద వచ్చే బాల్స్ ను నేరుగా సిక్సర్లుగా మలిచి స్టేడియం బయట పంపగల సత్త సంజూకి ఉంది.
Advertisement
కానీ షార్ట్ బంతులు వస్తే వాటిని పుల్ చేయాలనీ సంజూ ఉంటాడు. అలాగే స్పిన్నర్ల విషయంలో కూడా సంజూ శాంసన్ కాస్త నెమ్మదిగా ఆడుతాడు. అయితే అతన్ని మనం ఎక్కువ సేపు సైలెంట్‌గా ఉంచలేం. యధావిధిగా అతను తన హిట్టింగ్ లోకి వస్తాడు. అప్పుడు కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడిన.. తరత ఔట్ అవుతాడు. అలాగే ఓ మ్యాచ్ లో పరుగులు చేస్తే మరో మ్యాచ్ లో చేయడు. ఈ నిలకడ లేని కారణంగానే సంజూ టీం ఇండియాలోకి రాలేకపోతున్నాడు. అతనికి టేలెంట్ లేదు అని కాదు. కానీ దానిని సరిగ్గా వాడటం లేదు అని రవిశాస్త్రి అన్నారు. అయితే భారత జట్టులో 2015 లోకి మొదటిసారి ఎంట్రీ ఇచ్చిన సంజూ.. ఇప్పటివరకు 13 టీ20, ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు.
ఇవి కూడా చదవండి :