2011లో ధోని కెప్టెన్సీలో అద్భుతమైన ప్రదర్శన చేసే విశ్వవిజేతగా నిలిచింది టీమిండియా. అప్పటి టీంలో ధోని, యువరాజ్, సచిన్, గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి హేమహేమీలు ఉండేవారు. వీరంతా సమిష్టిగా ప్రపంచ క్రికెట్ జట్ల మీద వరల్డ్ కప్ లో విరుచుకుపడ్డారు. దాంతో చాలాఏళ్ల తర్వాత భారతజట్టు వన్డే వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఇది 2015 వరల్డ్ కప్ నాటికి అప్పటి స్టార్ ప్లేయర్లు సచిన్, వీరేంద్ర సెహ్వాల్, యువరాజ్ దూరమయ్యారు. దాంతో దాంతో సెమిస్ లోనే ఇంటిదారి పట్టింది టీమిండియా. ఇక 2019 వరల్డ్ కప్ కు ధోని ఒక్కడే సీనియర్ ప్లేయర్ గా ఆడాడు.
అప్పుడు కూడా కోహ్లీ కెప్టెన్సీలో భారత టీం సెమీస్లో ఓడిపోయింది. కానీ 2023లో జట్టు పరిపూర్ణంగా ఉంది. సీనియర్లుగా రోహిత్, కోహ్లీ, షమీ, జడేజా అద్భుత ప్రదర్శన చేస్తుంటే వారి అండతో యువ ఆటగాళ్లు శ్రేయస్, గిల్, రాహుల్, సిరాజ్ దూసుకుపోతున్నారు. వరల్డ్ కప్ ఛాంపియన్ అయ్యే అన్ని విభాగాల్లో టీమిండియా పటిష్టంగా ఉంది. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడున్న జట్టు ఏ దేశాన్ని అయినా ఓడించే ఛాన్స్ ఉందని, కాబట్టి ఇదే సరైన సమయం అని, ఇప్పుడు మిస్ అయితే మరో మూడు ఎడిషన్ ల పాటు టీమిండియా వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ లేదని తెలిపాడు. ఈ వరల్డ్ కప్ లో ఆడుతున్న సగం మంది సీనియర్ ఆటగాళ్లు వచ్చే 2027 ఎడిషన్ లో ఉండకపోవచ్చు.
Advertisement
Advertisement
వయస్సుతో పాటు ఫామ్ దృష్ట్యా కోహ్లీ, రోహిత్, శమీ, జడేజా లాంటి ప్లేయర్స్ కు ఇదే ఆఖరి వన్డే వరల్డ్ కప్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్లీ ఇలాంటి జట్టును తయారుచేయాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి రెండు అడుగుల దూరంలో ఉన్న కప్పును టీమిండియా సాధించడం ముఖ్యం. రవిశాస్త్రి చెప్పినట్టు ఇప్పుడు జట్టులో ఉన్న ప్లేయర్స్ చాలామంది వచ్చే ఎడిషన్ లో కనిపించకపోవచ్చు. కాబట్టి నాకౌట్ లో కాస్త ఒత్తిడిని చేస్తే టీమిండియా విశ్వవిజేతగా నిలుస్తుంది. ఇండియాలో టోర్నీ వరుస విజయాలతో ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉండటం రోహిత్ సేనకు కలిసి వచ్చే అంశం. మరి లాస్ట్ మెగా టోర్నీగా భావిస్తున్న రోహిత్, కోహ్లీ టీమిండియాకు కప్పు అందిస్తారో లేదో చూడాలి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.