సుడిగాలి సుదీర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన సుధీర్ అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ లో రష్మితో కలిసి లవ్ ట్రాక్ నడిపించాడు. అంతే అప్పటినుంచి వీరిద్దరికీ వచ్చిన క్రేజ్ ఇప్పటివరకు మరే జంటలకు రావడం లేదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అంత చక్కగా వర్కౌట్ అవుతుంది. నిజంగా లవర్సా లేకపోతే అలా నటిస్తారా అనేది చాలామందికి అంతూ చిక్కని ప్రశ్న.
కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని సుదీర్, రష్మీ అభిమానులు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. సుధీర్ ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలను మానేసి ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాను నటించిన “కాలింగ్ సహస్ర” సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో సుధీర్ పాల్గొంటున్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగా సుధీర్ కి ఓ ప్రశ్న ఎదురయింది. రష్మితో పెళ్లి ఎప్పుడు అని అడగ్గా… దానికి సమాధానంగా సుదీర్ సమాధానం చెబుతూ ఈ ప్రశ్న నాకు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది. రష్మితో లవ్ ట్రాక్ అంతా కేవలం స్క్రీన్ ముందు మాత్రమే. ఇక పెళ్లి అంటారా అది మా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే మేమిద్దరం ఫుల్ బిజీగా ఉన్నాము.
Advertisement
Advertisement
నిజానికి అయితే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఒకవేళ చేసుకోవాలని అనిపిస్తే తప్పకుండా చేసుకుంటాను అని సుధీర్ చెప్పాడు. రష్మితో సినిమా ఎప్పుడు చేస్తారు అని మరో అభిమాని అడగ్గా…. మేమిద్దరం తప్పకుండా సినిమా చేస్తాము. మా ఇద్దరికీ తగిన విధంగా కథ వస్తే చేస్తాము అని చెప్పుకొచ్చాడు. ఇక ఏది ఏమైనాప్పటికీ వీరిద్దరి వివాహం జరగాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!