Home » Kathika Nair : కాబోయే భర్తను పరిచయం చేసిన ‘రంగం’ హీరోయిన్..

Kathika Nair : కాబోయే భర్తను పరిచయం చేసిన ‘రంగం’ హీరోయిన్..

by Bunty
Ad

ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది వారసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాగే కొంతమంది చాలా కష్టపడి ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే… ఇండస్ట్రీలో ప్రస్తుతం ధనవంతు పాత్ర పోషిస్తున్న హీరోయిన్లలో కార్తీక నాయర్ ఒకరు. ఈ బ్యూటీ ఎవరో కాదు… అలనాటి సీనియర్ హీరోయిన్ రాధ కూతురు.

rangam-karthika-nair-set-to-marry-boyfriend

rangam-karthika-nair-set-to-marry-boyfriend

కార్తిక నాయర్ మొదట మోడల్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్ గా పరిచయమైంది. మొట్టమొదటగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హీరోయిన్గా పరిచయమైంది ఈ బ్యూటీ. 2009 సంవత్సరంలో వచ్చిన అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన జోష్ సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కార్తిక. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ మంచి పేరు మాత్రం వచ్చింది. ఇక జీవా చేసిన రంగం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది హీరోయిన్ కార్తీక.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడ ఉంది. ఈ నేపథ్యంలోనే తన కాబోయే వరుడి ఫోటోను పంచుకుంది. తనకు కాబోయే భర్తను తాజాగా పరిచయం చేసింది హీరోయిన్ కార్తీక. రోహిత్ మేనన్ ను హీరోయిన్ కార్తిక వివాహం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతనితో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా హీరోయిన్ కార్తిక… బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading