టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ 61 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. వెంకీ తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.అయితే విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ “రానా నాయుడు”.
Advertisement
ఈ వెబ్ సిరీస్ మార్చ్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా రానా నాయుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ లో రానా మరియు వెంకటేష్ తొలిసారిగా నటిస్తుండటంతో భారీగా క్రేజ్ కనిపిస్తోంది. అయితే ఫ్యామిలీ మరియు గ్యాంగ్ స్టార్ డ్రామా దగ్గరికి ఎక్కిన రానా నాయుడు ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రానా నాయుడు వెబ్ సిరీస్ లో బాలీవుడ్ లో ఎలాంటి స్కాండల్ నైనా సులభంగా పరిష్కరించే గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. నాగా నాయుడు పాత్రలో వెంకటేష్ తో కలిసి తండ్రి, కొడుకులుగా తెర మీద కూడా కనిపించేందుకు రెడీ అయ్యారు. తండ్రి, కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్, రివేంజ్ డ్రామా అని ట్రైలర్ స్పష్టం చేసింది.
Advertisement
బాలీవుడ్ మాఫియాలో అరాచకాలు చేసే పాత్రలో రానా ఫైర్ బ్రాండ్ గా కనిపించాడు. నాగా నాయుడుగా వెంకటేష్ నేరానికి శిక్ష అనుభవించి, చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చే నేరస్తుడిగా ట్రైలర్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడే ఒకడిని వేసేసి, వచ్చాను అంటూ నాగా నాయుడు కామెంట్ చేయడం కనిపించింది. నేను ఏది చేసిన ఫ్యామిలీ కోసమే చేశాను అంటూ నాగా నాయుడు చెప్పడం చూస్తే, ఇది ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కనిపించింది. నాగా నాయుడి ఇద్దరు పిల్లల తల్లి హత్యకు గురైందని ట్రైలర్ లో చూపించారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మార్చి పదవ తేదీ దాకా ఆగాల్సిందే.
READ ALSO : హైదరాబాద్ ప్రజలకు ఫుల్ సేఫ్టీ…నగరంలో కొత్తగా 20 కొత్త పోలీస్ స్టేషన్లు