Home » అప్పట్లో ఆ హీరోతో మంచి రిలేషన్ ఉండేదని షాకింగ్ నిజాలు చెప్పిన రాములమ్మ..!

అప్పట్లో ఆ హీరోతో మంచి రిలేషన్ ఉండేదని షాకింగ్ నిజాలు చెప్పిన రాములమ్మ..!

by Sravanthi
Ad

మనకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటేనే ముందుగా గుర్తొచ్చేది నటి విజయశాంతి. ఆ సమయంలో ఆమె హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేది అంటే ఆమె ఎంతటి స్టార్డమ్ సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె తీసిన సినిమాల్లో ఎక్కువగా సంచలన విజయాలు సాధించినవె వున్నాయి. ముఖ్యంగా ఆమె తెరపై బాలకృష్ణ మరియు చిరంజీవిలతో ఎక్కువగా సినిమాలు చేసింది. అప్పట్లో వీరి కాంబినేషన్లో సినిమా వస్తే మామూలు హిట్ ఉండేది కాదు. చాలా మంది అభిమానులు ఇష్టపడే జంటలు. ముఖ్యంగా విజయశాంతి బాలకృష్ణ తో కలిసి దాదాపుగా 17 సినిమాలు చేసింది. అందులో చాలా సినిమాలు ఘన విజయం సాధించాయి. అలాగే విజయశాంతి చిరంజీవితో కూడా స్క్రీన్ పై గొప్ప కెమిస్ట్రీని కలిగి ఉండేవారు. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపుగా 19 సినిమాలు వచ్చాయి.

Advertisement

Advertisement

ఇందులో ఎక్కువ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. ఇద్దరు హీరోలతో విజయశాంతి కాంబినేషన్ అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఎక్కువ సినిమాలు వీరి కాంబినేషన్ లోనే వచ్చాయి. కానీ ప్రస్తుతం విజయశాంతి ఇద్దరు స్టార్ హీరోలతో పని చేయడం మానేయడంతో ఒక పాయింట్ తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరు దిగ్గజాల మధ్య సమస్యలు ఉన్నాయని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ వీరు ఎవరు దీని గురించి బహిరంగంగా మాత్రం స్పందించలేదని చెప్పవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ తో ఉన్నటువంటి విబేదాల గురించి విజయశాంతి బయట పెట్టింది. అప్పట్లో నిర్మాతలు, దర్శకులు విజయశాంతి బాలకృష్ణ జోడిని చాలా ఇష్టపడే వారని.

అందువల్ల వీరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు వచ్చాయనేది ప్రధాన కారణం. వీరిద్దరూ కలిసి చేసినటువంటి చివరి సినిమా తర్వాత వీళ్ళ మధ్య విభేదాలు పెరిగిపోయాయని ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేశాయి. 1993 లో విడుదలైనటువంటి నిప్పురవ్వ మూవీ సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే వీరు కలిసి పని చేయడం మానేశారు అని సమాచారం. అదేవిధంగా చిరంజీవితో కూడా విజయశాంతి గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. కానీ చాలా ఏళ్ల తర్వాత అందులో నిజం లేదని స్పష్టం చేసింది విజయశాంతి. అయితే ప్రస్తుతం రాములమ్మ సినిమాలను వదిలిపెట్టి ఎక్కువగా రాజకీయలపై దృష్టిసారించింది.

Visitors Are Also Reading