Home » Rambha Daughter: రంభ లేటెస్ట్ ఫొటోస్ ని చూసారా..? ఆమె కూతురు ఎంత అందంగా ఉందో..!

Rambha Daughter: రంభ లేటెస్ట్ ఫొటోస్ ని చూసారా..? ఆమె కూతురు ఎంత అందంగా ఉందో..!

by Sravya
Ad

నటి రంభ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రంభ అందరికీ సుపరిచితమే చాలా మంది టాప్ హీరోల పక్కన రంభ నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఈమె భారీ పాపులారిటీని దక్కించుకుంది. రంభ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెర మీదకి వచ్చింది మొదటి సినిమాతోనే సక్సెస్ ని అందుకుంది రంభ. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో నటించింది రంభ. 90లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది తెలుగులోనే కాకుండా మలయాళ, హిందీ భాషల్లో కూడా నటించి పేరు సంపాదించుకుంది.

rambha-Daughter

Advertisement

 

అన్ని భాషల్లో కలిపి మొత్తానికి వందకి పైదిగా సినిమాలు చేసింది కేవలం హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి కూడా ఆకట్టుకుంది రంభ. చివరగా అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనపడింది. తర్వాత కెనడా కి చెందిన బిజినెస్ ఇంద్ర కుమార్ ని పెళ్లి చేసుకుంది సినిమాకి దూరమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం కెనడాలో వీళ్ళు ఉంటున్నారు.

Advertisement

సినిమాలు కి దూరమైనా రంబ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఫ్యామిలీ ఫొటోస్ ని, పర్సనల్ ఫొటోస్ ని కూడా పంచుకుంటూ ఉంటోంది. అలానే ఆమె నటించిన సినిమాలు ఇండస్ట్రీలో ఈమె కి ఉన్న స్నేహితుల గురించి కూడా ఆసక్తికరమైన పోస్టులు పెడుతుంది తాజాగా తన పెద్ద కూతురుతో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేసింది. మై ఏంజెల్ అంటూ ఒక ఫోటో కి క్యాప్షన్ ఇచ్చి రంభ ఫోటోలని పంచుకుంది. అయితే రంబ కూతుర్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అందంలో తల్లిని మించిపోయినట్టు ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. రంభ ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ని విపరీతంగా షేర్ చేస్తున్నారు మరి నటి రంభ షేర్ చేసుకున్న అద్భుతమైన ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading