Home » రాంగోపాల్ వర్మ అరెస్ట్..? అసలేం అయ్యింది..?

రాంగోపాల్ వర్మ అరెస్ట్..? అసలేం అయ్యింది..?

by Sravanthi
Ad

రామ్ గోపాల్ వర్మకి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ పై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేస్తుంది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. రామ్ గోపాల్ వర్మ కి ఇప్పుడు జైలు శిక్ష తప్పదా…? అసలు ఏం జరిగింది అనేది చూస్తే.. రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ తర్వాత కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. బ్లాక్ బస్టర్ సినిమాలని రూపొందించిన గొప్ప దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు తర్వాత ఏమైందో ఏమో కానీ వివాదాలతో స్నేహం చేస్తున్నారు.

Advertisement

Advertisement

వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారారు. రక్త చరిత్ర మూవీ తర్వాత ఆయన సినిమాలు తీసే స్టైల్ కూడా మారిపోయింది. రాజకీయ నాయకుల జీవిత చరిత్ర పేరుతో ఇష్టం వచ్చినట్లుగా కథలు తీస్తూ ఉండడం తర్వాత వార్తల్లోకి ఎక్కడం వంటివి మనం చూసాం. అంతటితో ఆగలేదు. రాజకీయాలపై కూడా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నాడు.

Also read:

రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. జగన్ కి సపోర్ట్ గా ఉంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, నారా బ్రాహ్మణి పై కించపరిచే విధంగా ఆయన పోస్టులు పెట్టారనే ఆరోపణల ఆధారంగా ఐటి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading