Home » సౌత్ సినిమాలపై నోరు పారేసుకున్న రకుల్…. నెటిజన్స్ ఫైర్…!

సౌత్ సినిమాలపై నోరు పారేసుకున్న రకుల్…. నెటిజన్స్ ఫైర్…!

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా రాణిస్తున్న బ్యూటీలలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. మొదట బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు జోడిగా రకుల్ సినిమాలు చేసింది.

Advertisement

అయితే కొంతకాలంగా మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ లోనూ ఒక సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్ లపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ దేశంలోనే టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

దాంతో ప్రేక్షకులు బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు బాగుంటాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని పేర్కొంది. బాలీవుడ్, సౌత్ సినిమాలు రెండూ ఒకటే అని వ్యాఖ్యానించింది.

వేరువేరుగా చూడవద్దని దేశంలో ప్రగతి గల దర్శకులు ఉన్నారని పేర్కొంది. వాళ్ళు మంచి సినిమాలు చేయడం మనకే గర్వకారణం అంటూ రకుల్ కామెంట్ చేసింది. కాగా రకుల్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. బాలీవుడ్ సినిమాలను సౌత్ సినిమా లతో పోలిస్తే కోపం వస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నీకు సౌత్ సినిమాలతోనే గుర్తింపు వచ్చింది అనే విషయాన్ని మర్చిపోయావు కదా అంటూ రకుల్ పై ఫైర్ అవుతున్నారు.

Visitors Are Also Reading