రాజమౌళి అంటే టాలీవుడ్ దర్శకుల్లో బంగారు బాతు….ఆయతో సినిమా చేసేందుకు అవకాశం ఇస్తే నిర్మాత పంట పండినట్టే. మిగతా సినిమాలన్నీ వందల కోట్ల లెక్కలు వేసుకుంటే జక్కన్న సినిమాలు వేల కోట్ల కలెక్షన్ల లెక్కలు చూపిస్తుంటాయి. స్టూడెంట్ నెం 1 సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన జక్కన్న ప్రస్తుతం దేశంలోనే నెం 1 డైరెక్టర్ స్థానానికి చేరుకున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాకు మాత్రం అనుకున్నమేర లాభాలు రాలేదట.
ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత వెల్లడించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అన్న సంగతి ఇప్పుడు చూద్దాం..రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా సై…ఈ సినిమాను ఏ భారతి అనే డిస్ట్రిబ్యూటర్ నిర్మించారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా నిర్మాతను నిరాశపరిచిందట. అయితే నష్టాలు కూడా రాలేదట. అంటే సినిమా కోసం ఖర్చు చేసిన బడ్జెట్ వర్కౌట్ అయ్యింది అంతే.
Advertisement
Advertisement
ఈ విషయాన్ని నిర్మాత భారతి రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాకుండా సై సినిమా కథ విన్న తరవాత నితిన్ తో కాకుండా పెద్ద స్టార్స్ ఎవరితోనైనా చేయాలని అనుకున్నారట. కానీ నితిన్ తన తండ్రి నిర్మాత భారతి ఇంటికి వచ్చి అలా చేయకూడదు అని కోరారట.
వారితో ఉన్న సన్నిహిత్యం వల్ల నితిన్ ను హీరోగా కంటిన్వ్యూ చేశారట. ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా అంటే ప్రస్తుతం హీరోను చూడకుండానే సినిమాకు వెళ్లే పరిస్థతి ఉంది. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమా విజయంతో దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు విడుదలకు ముందే భారీ మొత్తంలో ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.