వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఓడిపోవడానికి కారణం ప్రధాని మోడీ అని వ్యంగ్యo గా విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. ఆదివారం రోజున వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.
అయితే ఇందులో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు… అవలీలగా లక్ష్యాన్ని చేదించింది. మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే 241 పరుగులు చేసి విశ్వ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా జట్టు.
Advertisement
Advertisement
అయితే ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని మోడీ రావడం పట్ల రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి చెడు శకునం వచ్చాడు.. దీంతో టీమిండియా గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోయిందని విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. టీవీలో దీనిని చూపించారు… కానీ దేశ ప్రజలకు… మోడీ వల్ల ఓడిందని తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యక్తుల పట్ల బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.