ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వివాహాన్ని చాలా అందంగా వైభవంగా జరుపుకుంటున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వివాహాలు ఆడంబరంగా జరుపుకోవడం ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఇక సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వివాహాలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంగరంగ వైభవంగా లక్షల కోట్ల డబ్బులను ఖర్చు చేసి మరి వివాహాలను చాలా ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ చాలా విచిత్రంగా ఓ ఎమ్మెల్యే తన కూతురికి ప్రేమ వివాహాన్ని చాలా సింపుల్ గా, సాంప్రదాయబద్ధంగా గుడిలో నిర్వహించారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తన కుమార్తె వివాహాన్ని వెంకటేశ్వరస్వామి గుడిలో చాలా సింపుల్ గా నిర్వహించారు. అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ క్రమంలో శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… తన కూతురు చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తిని ప్రేమించిందని, ఆ వ్యక్తితోనే తన వివాహాన్ని చాలా సింపుల్ గా జరిపించానని చెప్పుకొచ్చాడు. డబ్బు, హోదా, కులం ఇలాంటివేవీ చూడకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లిని జరిపించాలని చెప్పుకొచ్చారు. వివాహాన్ని చాలా గ్రాండ్ గా జరిపించాలని నాకు కోరిక ఉన్నప్పటికీ నా కూతురు మాత్రం దానికి అంగీకరించలేదు.
Advertisement
Advertisement
చాలా సింపుల్ గా వివాహాన్ని జరిపించండి అని కోరింది. అందుకే నా కుమార్తె కోరిక మేరకు చాలా సింపుల్గా వివాహాన్ని జరిపించాను. అదేవిధంగా ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకు శివప్రసాద్ రెడ్డి సలహా కూడా ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయి తాను ఇష్టపడిన వ్యక్తితో వివాహాన్ని జరిపించండి. అమ్మాయిలు ఒక అబ్బాయిని ఇష్టపడిన తర్వాత మరొక వ్యక్తితో వివాహం చేయడం సరికాదని, ఒకవేళ అమ్మాయి తప్పటడుగు వేస్తే సరిచేయడం వరకే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి కానీ వారి ఇష్టాన్ని తిరస్కరించే హక్కు ఏ ఒక్క తల్లిదండ్రులకు లేదని చెప్పారు. మనకు కావాల్సింది మన పిల్లలు సంతోషంగా ఉండడమే. కాబట్టి వారు ఇష్టపడిన వ్యక్తితో వివాహాన్ని జరిపిస్తే వారు సంతోషంగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
Chiranjeevi : ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన సురేఖ..కానీ చివరికి..?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్.. యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం!
MS Dhoni : ఇదేం క్రేజ్ బ్రో.. ఏకంగా ట్రంప్ తోనే ధోని ఆటలు