బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు తాజాగా ఆసక్తికర కామెంట్లు చేసింది. జాతీయ బాలికల దినోత్సవం సంధర్బంగా పీవీ సింధు ఇస్మార్ట్ సైబర్ చైల్డ్ పేరుతో తెలంగాణ మహిళల భద్రతా విభాగం ఏర్పాటు చేసిన వెబినార్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైంది.ఈ సంధర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ….ఇంటర్నెట్ లో అవహేలన చేయడం వేధింపులు నిత్యం ఉంటాయని వ్యాఖ్యానించింది. వాటిని బాలికలు ధైర్యంగా ఎదుర్కొవాలంటూ ధైర్యం చెప్పింది.
Advertisement
Advertisement
సైబర్ నేరాల బారిన పడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని..రాష్ట్రంలో షీటీం మహిళల భద్రత కోసం కృషి చేస్తోందని పీవీ సింధు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ఆన్లైన్ వెబినార్ ద్వారా మొత్తం 3300 విద్యార్థులు, 1650 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించామని మహిళల భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా తెలిపారు. ఇక పీవీ సింధూ దేశం తరపున ఆడి ఒలపింక్స్ లో మెడల్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇప్పటి వరకూ పీవీ సింధూ దేశం తరపున ఆడి ఎన్నో పతకాలను సాధించింది.