సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదగాలంటే అంత ఈజీకాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. టాలెంట్ ఉన్నా కమిట్మెంట్ లేకపోతే హీరోగా రానించలేరు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే.
Advertisement
కాగా చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగే క్రమంలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. దర్శకనిర్మాతల చేతులో తిట్లు తిన్న సంధర్బాలు కూడా ఉన్నాయి. అప్పటి వరకూ విలన్ పాత్రలు మరియు ఇతర పాత్రలలో నటించిన చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాను క్రాంతి కుమార్ నిర్మించారు. ఈ సినిమా తరవాత నిర్మాత చిరంజీవి నటన చూసి ఆయనతో మరో సినిమా చేయాలని నిర్నయం తీసుకున్నారు.
Advertisement
సర్దార్ పాపారాయడు సినిమా తరవాత క్రాంతి కుమార్ చిరుతో తన క్రాంతి బ్యానర్ లో న్యాయం కావాలి అనే సినిమాను ప్లాన్ చేశారు. ఈ క్రమంలో కోదండిరామిరెడ్డి దర్శకత్వం వహించిన సంధ్య సినిమా చూసి క్రాంతి ఫిదా అయ్యారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవితో సినిమా చేయాలని నిర్నయించుకున్నారు. దర్శకుడు కోదండిరామిరెడ్డి ఓ ప్రముఖ నవల ఆధారంగా న్యాయంకావాలి సినిమా కథను సిద్దం చేసుకుని నిర్మాతకు వినిపించాడు. నిర్మాత కు కూడ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాధికను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత క్రాంతి కుమార్ వచ్చి చిరంజీవిని తిట్టారట. వేరే షాట్ తీస్తున్నారని చిరు షూటింగ్ బయట నిలుచున్నారట. దాంతో నిర్మాత వచ్చి నిన్ను ఒకరు వచ్చి పిలవాలా ఇంట్రెస్ట్ లేకుంటే చెప్పు ప్యాకప్ చెప్పేద్దాం అంటూ ఫైర్ అయ్యారట. కానీ సాయంత్రం ఫోన్ చేసి నిర్మాత స్వారీ చెప్పి ఎవరి మీద కోపమో దగ్గరవాడివి కదా అని నీపైన చూపించాను అని చెప్పారట. ఈ విషయాన్ని చిరు పలు సందర్భాలలో గుర్తు చేసుకున్నారు.