ఒకప్పుడు పెళ్లిళ్లు చాలా చిన్నవయసులో చేసేవారు. అదో పెద్ద సవాల్ గా మారింది. ఆ తరవాత ప్రభుత్వాల కృషి వల్ల ఆ సమస్య తీరిపోయింది. ఇప్పుడు మరోకొత్త సమస్య మొదలైంది. పెళ్లిళ్లు వయసులో ఉన్నప్పుడు చేసుకోకుండా ఏజ్ బార్ అయ్యాక చేసుకుంటున్నారు. ఉద్యోగాలు రాలేదని జీవితంలో సెటిల్ అవ్వలేదని చాలా మంది పెళ్లికాని ప్రసాద్ లుగానే మిగిలిపోతున్నారు. దాంతో 30 దాటి 40 ఏళ్ల మధ్యలో ఎక్కువ మంది వివాహాలు చేసుకుంటున్నారు.
Advertisement
పురుషులు స్త్రీలు ఇలా ఎవరిని చూసినా ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి సరైన వయసులో ఉన్నప్పుడు చేసుకుంటే పిల్లలను కనే అవకాశం ఉంటుంది. లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లలు పుట్టకపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
Advertisement
అంతే కాకుండా వృద్ధాప్యంలో మనవళ్లను చూసుకోకుండా పిల్లలను చూసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చేసరికి పిల్లలు ఇంకా జీవితంలో సెటిల్ కూడా కారని కాబట్టి వయసు పెరగకముందే పెళ్లి చేసుకోవాలని చెబుతున్నారు. జీవితంలో సమస్యలు ఎలాగూ ఉంటాయని వాటి గురించి పెళ్లిని వాయిదా వేసుకోకూడదని చెబుతున్నారు.
పెళ్లి విషయంలో వైవాహిక జీవితంలో సర్దుకుపోతే ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు. పెళ్లి కోసం ఎన్నో కలలు కంటారని కానీ కొన్నిసార్లు సర్దుకుపోవడం వల్లే జీవితం బాగుంటుందని చెబుతున్నారు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం అందం కోసం పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం వల్ల పెళ్లి ఆలస్యం అవుతుందని కాబట్టి అలా ఆలస్యం కాకుండా ముందు నుండే మంచిసంబంధాలను వెతుక్కునే పనిలో పడి పెళ్లి వయసులో ఉండగానే చేసుకోవాలని చెబుతున్నారు.
ALSO READ :పెళ్ళైన మగవారు పచ్చళ్లు తినడం ఆపేయాలట ఎందుకంటే ? దానిపై ప్రభావం తప్పదు..!