చాలామంది రాత్రిపూట ఎక్కువసేపు నిద్రపోరు. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోకపోతే చాలా సమస్యలు వస్తాయి. రాత్రిళ్ళు నిద్ర తగ్గితే ఒత్తిడి బాగా పెరుగుతుంది. అలానే ఈ లక్షణాలు ఇంకొక తరానికి కూడా సంక్రమిస్తాయని పరిశోధన చెప్తోంది. రాత్రిపూట తరచూ ఐదు గంటల కంటే తక్కువసేపు నిద్రపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుందట. జన్యుపరమైన అధ్యయనంలో తెలిసింది. తక్కువ నిద్రపోవడం వలన మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. నిద్రలేమి మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు ఇంకొక తరానికి కూడా స్ప్రెడ్ అవుతాయట.
Advertisement
Advertisement
ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు రాత్రిపూట కూడా ఫోన్ విడిచిపెట్టి ఉండట్లేదు. టీవీ ఫోన్లో తో పాటు ఇతర స్క్రీన్ లకి ఎడిక్ట్ అయిపోయి రాత్రిపూట నిద్రపోలేకపోతున్నారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడుకోవడం లేదంటే సినిమా చూస్తూ ఉండిపోవడం మొదలైన వాటి వలన అంతుచిక్కని రోగాలని కొని తెచ్చుకుంటున్నారు. రాత్రిపూట నిద్రపోవడానికి ఒక గంట ముందే మీరు ఫోన్లను ఆపేయాలి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి చూసుకోండి. మంచి నిద్ర ఉన్నట్లయితే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది సమస్యల నుండి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు.
మరిన్ని ఆరోగ్య చిట్కాలు కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!