Home » నా భర్తకు కూడా సమంత హాట్ గా కనిపించిది..ప్రియమణి సంచలన వ్యాఖ్యలు…!

నా భర్తకు కూడా సమంత హాట్ గా కనిపించిది..ప్రియమణి సంచలన వ్యాఖ్యలు…!

by AJAY
Ad

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ సినిమాలోని పాటలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామా పాట సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ఎక్కడ చూసినా సమంత ఐటం సాంగే వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ పాట పై టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Priyamani

Priyamani

ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ….ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తున్నాయని ప్రియమణి వ్యాఖ్యానించింది. గతంలో హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ గా కనిపించడం పొడి బట్టలు ధరించి అందాలను ఆరబోయడం… పెద్ద హీరోల సరసన కేవలం రొమాన్స్ కే పరిమితం కావడమని పేర్కొంది. కానీ ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారని తెలిపింది. హీరోలకు పోటీగా హీరోయిన్లు లీడ్ రోల్ పోషించే రోజులు వచ్చాయని ప్రియమణి కామెంట్ చేసింది.

Advertisement

Advertisement

దీనికి ఉదాహరణ సమంత, నయనతార అంటూ వ్యాఖ్యానించింది. పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా పాట సూపర్ హిట్ అయిందని ప్రియమణి తెలిపింది. ఈ పాటలో సమంత కేవలం తనకు మాత్రమే కాకుండా తన భర్తకు కూడా చాలా హాట్ గా కనిపించిందని పొగడ్తలు కురిపించింది. ప్రేక్షకుల దృష్టికోణం మారిందని హీరోయిన్లు చేసే అన్ని పాత్రలను అంగీకరిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించింది.

Samantha

Samantha

ఇది ఇలా ఉంటే పెళ్లి తర్వాత కూడా ప్రియమణి సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ప్రియమణి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకుంది. మరోవైపు టీవీ షోలను హోస్ట్ గా ప్రియమణి సందడి చేస్తోంది. త్వరలో ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ భామా కలాపం తో ప్రియమణి ప్రేక్షకులముందుకురానుంది.

Visitors Are Also Reading