బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్, స్టార్ ప్లేయర్ తమిమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు క్రికెటర్ తమీం ఇక్బాల్. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో తొలి మ్యాచ్ తర్వాత అతడు అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని ఈ సందర్భంగా తెలిపాడు.
Advertisement
గత సంవత్సరం తమీం టి20 ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక రిటైర్మెంట్ సందర్భంగా బోరున విలపించాడు క్రికెటర్ తమీం ఇక్బాల్. చటోగ్రామ్ లో అతను మాట్లాడుతూ… వివిధ కారణాలతో రిటైర్ అయిపోతున్నానని… ఆ కారణాలు ఇక్కడ ప్రస్తావించలేనని చెప్పాడు. నా కొత్త జీవితానికి అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ భావోద్వేగం అయ్యాడు ఇక్బాల్. మరోవైపు వన్డే వరల్డ్ కప్ కు మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో… ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటించడం పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Advertisement
ఇక అటు తమిళ్ ఇక్బాల్ తనను కలవాలని బంగ్లాదేశ్ ప్రధాని… షేక్ హసీనా ఆదేశాలు జారీ చేసింది. హుటా హుటిన రిటైర్మెంట్ ప్రకటించడంపై ఈ సందర్భంగా ఇక్బాల్ ద్వారా వివరాలు తెలుసుకోండి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. కాగా బంగ్లాదేశ్ క్రికెటర్ తమిమ్ ఇక్బాల్ రిటర్మెంట్ ప్రకటించడంతో… బంగ్లా క్రికెటర్లు అలాగే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇలాంటి స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
Praveen Kumar : టీమిండియా బౌలర్ ప్రవీణ్ కుమార్ కారుకు ప్రమాదం