మన దేశంలో బెట్టింగ్ అనేది చట్ట రీత్యా నేరం. కానీ దానిని ఎవరు అదుపు చేయలేకపోతున్నారు. మరి ముఖ్యంగా ఈ ఐపీఎల్ ప్రారంభం నుండి ముగింపు లోపు కొన్ని వేల కోట్ల బెట్టింగ్ అనేది జరుగుతుంది. ఎవరో కొంత మంది ఈ బెట్టింగ్ లో లాభ పడితే చాలా మంది చాలా డబ్బును పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలా డబ్బు పోగొట్టుకునేవారు తమ డబ్బు లేదా.. అప్పుల అడిగి తెచుకున్న డబ్బు నష్టపోతున్నారు. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఓ కొత్త వ్యవహారం అనేది బయటపడింది.
Advertisement
మధ్యప్రదేశ్ లోని ఓ పోస్ట్ ఆఫిస్ లో పని చేసే పోస్ట్ మాస్టర్ బెట్టింగ్ ఆడటానికి ప్రజల డబ్బును ఉపయోగించుకున్నాడు. అక్కడికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడానికి వచ్చిన ప్రజలను మోసం చేస్తూ ఆ డబ్బును బెట్టింగ్స్ కు ఉపయోగించేవాడు. ముందుగా అక్కడికి ఫిక్స్‌డ్ డిపాజిట్లకోసం వచ్చే వారికీ నకిలీ పేపర్స్ ఇచ్చే వాడు. ఆ తర్వాత ఆ డబ్బును బెట్టింగ్ లలో పెట్టేవాడు.
Advertisement
అయితే కొంత మంది డిపాజిటర్లు డబ్బు వెన్నకి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బు డిపాజిట్ కాలేదు అని తెలియడంతో పోస్ట్ మాస్టర్ వ్యవహారం బయటికి వచ్చింది. దాంతో పోలీసులను బాధితులు ఆశ్రయించగా… వారు అతడిని ఆశ్రయించారు. అయితే ఈ ఒక్క ఏడాదే దాదాపు కోటికి పైగా డబ్బు మాయం చేసిన ఆ వ్యక్తి గత రెండేళ్లుగా ఇదే పని చేస్తూ.. దాదాపు 2 కోట్లు దారి మలిచాడు అని పోలీసులు తెలిపారు. అందులో దాదాపు కోటి రూపాయలు బెట్టింగ్ లో పోగొటగా.. మరో కోటి దాకా అతని దగ్గరే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో మధ్యప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇవి కూడా చదవండి :