Home » TDPలోకి పోసాని కృష్ణమురళి..? బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన లోకేష్‌ !

TDPలోకి పోసాని కృష్ణమురళి..? బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన లోకేష్‌ !

by Bunty
Ad

 

నన్ను చ****పేందు నారా లోకేశ్ కుట్ర చేస్తున్నాడని.. నేను చనిపోతే లోకేష్ దే బాధ్యత అంటూ ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడు. ఇవాళ తాడెపల్లి గూడెంలో ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఈ సందర్భంగా ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. నారా లోకేష్ నా పై పరువు నష్టం కేసు వేశారని.. లోకేష్ 18 ఎకరాలు కొన్నారని నేను అన్నానట…తాను ఒక ఎకరం కూడా కొనలేదట అంటూ మండిపడ్డారు.

Advertisement

నాలుగు కోట్ల నష్టపరిహారం, రెండు ఏళ్ళు జైలు శిక్ష కూడా నాకు పడే అవకాశం ఉందట అంటూ ఫైర్‌ అయ్యారు. లోకేష్ మృదు స్వభావి అని.. కారులో బైనాక్యులర్స్ పెట్టుకుని చీమలకు కూడా హాని కలగకుండా వెళతారట అంటూ చురకలు అంటించారు. లోకేష్… అమ్మనా బూతులు తిడితే పరువు నష్టం దావా వేయకూడదా?? అని ప్రశ్నించారు. నారా లోకేష్ పీఏ చైతన్య నాకు ఫోన్ చేశాడని.. నాకు అనారోగ్యంగా ఉందని తెలిసి పరామర్శించటానికి వస్తాను అన్నాడని వివరించారు.

Advertisement

తర్వాత పది రోజులకు ఫోన్ చేసి టీడీపీలో చేరాలని మళ్ళీ ఫోన్ చేశాడని పేర్కొన్నారు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. కానీ నేను రిజెక్ట్‌ చేశానన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే లోకేష్ పోస్టింగ్‌లు ఇస్తాడట… లోకేష్ వాళ్ళ అమ్మ భువనేశ్వరి, భార్య ఆస్తులు లోకేష్ వి కావా?? అంటూ నిలదీశారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది వాస్తవం కాదా? లోకేష్ కు తెలియకుండా బ్రాహ్మణి హెరిటేజ్ లో డైరెక్టర్ అయ్యిందా?? అని నిలదీశాడు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. పుంగనూరులో పోలీసుల పై దాడి చేసినట్టు కుట్ర… రెండు దెబ్బలు వేస్తే నేనైతే పడిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.

ఇవి కూడా చదవండి 

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ…సీఎం కేసీఆర్‌ క్రేజీ ఆఫర్‌ !

NTR : ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా !!

 

Visitors Are Also Reading