ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ చేయమని ముఖ్యమంత్రి జగన్ నాకు చెప్పారని.. డ్రామా, టీవీ, సినిమా ఈ మూడు రంగాలకు ఒకేసారి సాధ్యం కాదని చెప్పానని తెలిపారు.
Advertisement
పద్య నాటకాలకు ఊపిరి పోయాల్సిన అవసరం ఉందని.. అందుకే ముందు నాటక రంగానికి నంది అవార్డులు ఇవ్వాలని అన్నారు. నంది అవార్డులు అంటేనే భయం వేస్తోందని.. నేను నంది తీసుకుంటే..కమ్మనైనింది అవుద్ది అని చెప్పానని వివరించారు పోసాని. ఒక్కొక్కరికి రెండు, మూడు ఇచ్చారని.. గతంలో అంబికా కృష్ణ ని చంద్రబాబు తిట్టారని ఆగ్రహించారు.
Advertisement
అంబికా కృష్ణ తనకి స్వేచ్ఛ ఇవ్వలేదని చంద్రబాబుకి చెప్పేశాడని.. మేము నంది అవార్డులను ఉత్తములు, అర్హులకు ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరు షూటింగ్ లు చేసినా ఉచితంగా చేసుకోవచ్చని.. స్టూడియోలు కడితే సహకరిస్తాం అని సీఎం జగన్ చెప్పారన్నారు పోసాని. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కూడా సహకారం కోసం మాట్లాడుతానని.. రూల్ ప్రకారం, జీవోల ప్రకారం కొన్ని పనులు చేయలేమన్నారు. కొన్ని ప్రాక్టికాలిటీతో, అభ్యర్థులతో అవుతాయని చెప్పారు పోసాని కృష్ణ మురళి.
ఇవి కూడా చదవండి
ICC : వరల్డ్ కప్ షెడ్యూల్లో టీమిండియాకు అన్యాయం! ఐసీసీ కావాలనే చేసిందా?
టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?
2011 వన్డే వరల్డ్ కప్లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..