ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. మెగాహీరో వరుణ్ తేజ్ పరిచయమైన ముకుంద సినిమాతో పూజా టాలీవుడ్ కు పరియమైంది. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది కానీ పూజాపై తెలుగు ప్రేక్షకుల కన్ను పడింది. చూడ్డానికి ముకుంద సినిమాలో పూజా పదహారనాల తెలుగమ్మాయిలా కనిపించి అందర్నీ తనవైపు తిప్పుకుంది. ఆ తరవాత చాలానే సినిమాలు చేసింది కానీ మళ్లీ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంతో ఈ అమ్మడు సూపర్ హిట్ అందుకుంది. అల వైకుంఠపురంలో తన అందాల ఆరభతతో పాటు నటనతో ప్రేక్షకులను మైమరిపించింది.
ఇక ఈ సినిమా తరవాత వరుస ఆఫర్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం పూజా ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో పూజా క్రేజ్ మరింత పెరిగింది. ఇదిలా ఉండగానే పూజా మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కు జోడీగా నటించింది. ఈ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఇలా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బుట్టబొమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Advertisement
Advertisement
ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని…వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నానని చెప్పింది. ఇక వివాహ బంధం గురించి మీ అభిప్రాయం ఏంటని పూజను ప్రశ్నించగా….ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అవి చేసినవాళ్లకే తెలుస్తుంది. ఇటీవలే ముంబైలో ఓ ఇల్లుకట్టుకున్నాను…అదే ఇలా ఉంటే ఇక పెళ్లి ఎలా ఉంటుందో అంటూ అన్సర్ ఇచ్చింది. కానీ పెళ్లి చేసునేటప్పుడు వీళ్లతోనే జీవితాంతం కలిసి ఉంటే భాగుంటుంది అనిపించాలి. అలా అనిపించినప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఒత్తిడి ఇతర కారణాల వల్ల మాత్రం పెళ్లి చేసుకోవద్దు. అంటూ సమాధానం ఇచ్చింది.
భీమ్లా నాయక్ సినిమాలో “అడవితల్లి మాట” పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..?