Home » టీమిండియా క్రికెటర్తో పూజా హెగ్డే ప్రేమాయాణం.. ఆ ప్లేయర్‌ ఎవరంటే ?

టీమిండియా క్రికెటర్తో పూజా హెగ్డే ప్రేమాయాణం.. ఆ ప్లేయర్‌ ఎవరంటే ?

by Bunty
Ad

బుట్టబొమ్మ పూజ హెగ్డే గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు. అలా వైకుంఠపురంలో సినిమాతో ఈ అమ్మడు సినీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. తెలుగులో నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలను అందుకుంది. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో ఈ అమ్మడు హవా కొనసాగింది.

Pooja Hegde Love Affair with Mumbai Star Cricketer

Pooja Hegde Love Affair with Mumbai Star Cricketer

ప్రస్తుతం ఈ అమ్మడుకు పెద్దగా తెలుగులో సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. ఈ అమ్మడు తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ఓ సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా నుంచి పూజా తప్పుకుంది.

Advertisement

Advertisement

ఇక ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకొని మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ కు గురయ్యారు. అయితే పూజా హెగ్డే త్వరలోనే వివాహం చేసుకోబోతుందని, ముంబైకి చెందిన ఓ స్టార్ క్రికెటర్ ను పెళ్లాడబోతుందనే వార్త వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆ స్టార్ క్రికెటర్ ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారినప్పటికీ పూజ హెగ్డే ఈ వార్తపై స్పందించలేదు. అవును అని, కాదు అని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ వార్తలపై ఎంతవరకు నిజముందో తెలియాలంటే పూజ క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading