పరిచయం:
PONNIYAN SELVAN PS1 Review in Telugu: బాహుబలి సినిమా తరవాత ఇండియన్ సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. భారీ బడ్టెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కథలో బలం ఉంటే వేల కోట్లు పెట్టడానికి అయినా నిర్మాతలు వెనకడుగుడు వేయడం లేదు. అంతే కాకుండా భారీ తారాగణంతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా వచ్చిన సినిమానే పొన్నియన్ సెల్వన్. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయంరవి ప్రధాన పాత్రలలో ఈ సినిమా తెరెక్కింది. సినిమాలో ఐశ్వర్యరాయ్ త్రిష హీరోయిన్ లుగా నటించారు.
కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాకుండా లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సినిమాను స్వరాలు సమకూర్చారు. మణిరత్నం తన డీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమాను భావించారు. ఈ సినిమా పోస్టర్ లు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30 విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయ్యిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం..
Advertisement
కథ కథనం :
1000 సంవత్సరాల క్రితం జరిగిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగంలో కార్తీక్ వండియతేవన్, విక్రమ్ గ్రౌండ్ ప్రిన్స్ ఆదితా పాత్రల్లో నటించారు. వండియతేవన్ కలికాలం నుండి ఒక లెటర్ ను ఇవ్వడానికి చోళ రాజ్యంలో అడుగు పెడతాడు. ఆ రాజ్యంలో సామంతులు చిన్న పెద్దల వల్ల ప్రణాళిక చేయబడిన అంతర్యుద్ధం ఉంటుంది. కాగా రాజకీయ ప్రశాంతతను తీసుకురావడానికి త్రిష కుందవాయి ప్రయత్నిస్తూ ఉంటారు. చోళ సామ్రాజ్యం రక్షకుడు అయిన అరుణ్ మోలి వర్మ జయం రవి రాజ్యాన్ని యుద్దం నుండి ఎలా రక్షిస్తాడు..? ఐశ్వర్య నందిని ప్రాత్ర ఏమిటి..? మరి రాజ్యాన్ని కాపాడగలిగారా లేదా అన్నదే ఈ సినిమా కథ.
Advertisement
కథల విషయానికొస్తే ఇది పూర్తిగా తమిళ సినిమా అనే చెప్పాలి. తెలుగు ఇతర భాషల్లో సినిమాను డబ్బింగ్ చేసినప్పటికీ ప్రేక్షకులు ఆ పాత్రలతో కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాని కారణం చోళచరిత్ర గురించి తమిళనాడుకు తప్ప ఇతర ప్రేక్షకులకు అంతగా తెలియదు. చోళుల చరిత్రను పరిచయం చేస్తూ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే పాత్రలన్నీ పరిచయం చేసిన తర్వాత కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది.
తర్వాత సినిమా మళ్లీ ఆసక్తికరంగా మారి ఇంటర్వెల్ వరకు ఆసక్తికరంగా తీసుకువెళ్లడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమాలో అన్నీ ఉన్నా ఏదో మిస్సయింది అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. దానికి కారణం చోల చరిత్రతో తెలుగువారికి సంబంధం లేకపోవడమే. ఇక సినిమా విజువల్స్ పరంగా మాత్రం ప్రేక్షకులకు 100% న్యాయం చేసింది. కార్తీ, విక్రమ్ తమ తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. జయం రవికి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ అతని కోసం రాసిన పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంటుంది. త్రిష, ఐశ్వర్య లు సినిమాకు తమ వంతు న్యాయం చేశారు. అయితే సినిమా కాస్త డ్రామా గా అనిపించడంతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వదు. సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం మాత్రం వెన్నుముక గా మారింది అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లింది. సినిమాటోగ్రఫీ మిగిలిన సాంకేతిక బృందం సైతం తమ ప్రతిభను చూపించారు. మొత్తానికి పోనియన్ సిల్వన్ సినిమా చోళుల చరిత్ర…. ఆ చరిత్ర తెలిసి ఉంటే మాత్రం స్క్రీన్ పై చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది.
ALSO READ : Krishnam Raju Samsmarana Sabha : మరోసారి మనసు చాటుకున్న ప్రభాస్..!