కొన్ని సినిమాలు మొదట ఒక హీరోతో అనుకుంటే ఆ తర్వాత మరొకరితో చేయాల్సి వస్తుంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనో ఇతర కారణాలవల్లనో సినిమాలు చేతులు మారుతుంటాయి. అలా చాలా సినిమాలు ముందుగా ఒక హీరోని అనుకుని తర్వాత మరొకరితో తీసినవి ఉన్నాయి. కాగా తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలైంది. కాగా ఈ సినిమా విషయంలోనూ అలానే జరిగింది. ఈ సినిమాను లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. ఎన్నో బ్యూటిఫుల్ కథలను తెరకెక్కించిన మణిరత్నం మొదటిసారి భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా చేశారు.
Advertisement
ఈ సినిమాను చోళుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ కథ కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తరికెక్కింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా సెప్టెంబర్ 30న పొన్నియన్ సెల్వన్ 1 ను విడుదల చేశారు. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాకుండా జయం రవి సైతం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాడు.
Advertisement
ఇక సినిమాలో హీరోయిన్ గా త్రిష మరియు ఐశ్వర్యరాయ్ లు హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న సినిమా విడుదల అయింది. ఇక ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. దానికి కారణం ఇతర భాషల్లో చోళుల కథపై ప్రేక్షకులకు పట్టు లేకపోవడమే. అంతేకాకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు చేయడంలోనూ చిత్ర యూనిట్ కాస్త వెనకబడింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విక్రమ్, కార్తీ చేసిన పాత్రల స్థానంలో మొదట ఇద్దరు స్టార్ హీరోలను అనుకున్నారు. అయితే అందులో ఓ టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఈ సినిమాకు రచయితగా పనిచేసిన జయ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొదట ఈ సినిమాలో కార్తీ నటించిన పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబును అనుకున్నారట. కానీ మహేష్ బాబు బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాను రిజెక్ట్ చేశారట. అంతేకాకుండా సినిమాలో విక్రమ్ చేసిన పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ ని అనుకున్నారట. కానీ విజయ్ కూడా డేట్స్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దాంతో ఆ అవకాశం విక్రమ్, కార్తీలను వరించింది.