Home » “పొన్నియాన్ సెల్వన్” మూవీ ద్వారా రాజమౌళి ఆ పాఠం నేర్చుకోవాలా..?

“పొన్నియాన్ సెల్వన్” మూవీ ద్వారా రాజమౌళి ఆ పాఠం నేర్చుకోవాలా..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో హీరోకి… దర్శకుడికి… నిర్మాతకి… అందెందుకు ప్రతి టెక్నీషియన్ కి కూడా ఒక డ్రీం ప్రాజెక్టు ఉంటుంది. అలాగే కొంతమంది తమ డ్రీమ్ ప్రాజెక్టులను నెరవేర్చుకోవడం కోసం ఎంతైనా కష్టపడుతూ చివరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉంటారు. డ్రీమ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం మాత్రమే కాకుండా దానితో సక్సెస్ అందుకోవడం మరి ముఖ్యం.

Advertisement

ఇది ఇలా ఉంటే ఇండియా వ్యాప్తంగా గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం కూడా తన కెరీర్లో పోన్నియాన్ సెల్వన్ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ అని పోన్నియాన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా మూవీ తలకెక్కిస్తాను అని ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చాడు. చెప్పిన విధంగానే ఈ దర్శకుడు మూవీని రెండు భాగాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

Advertisement

mani ratnam

mani ratnam

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఇతర రాష్ట్రాల ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల అయినప్పటికీ తమిళ సినిమా గానే మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని ఎప్పటికైనా మహాభారతం ని మూవీగా తీస్తాను అని ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చాడు.

దానితో రాజమౌళి అనుకున్నాడు అంటే కచ్చితంగా తీసి తీరుతాడు. అద్భుతమైన క్వాలిటీతో తీస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే పొన్నియన్ సెల్వన్ మూవీ లాగా ఒక భాషకో… ఒక దేశానికో ఈ మూవీ నచ్చే విధంగా కాకుండా ప్రపంచం మొత్తం ఈ సినిమాని ఇష్టపడే విధంగా ఈ సినిమాలోని ఎమోషన్స్ కానక్ట్ అయ్యే విధంగా రాజమౌళి మహాభారతం సినిమాని తెరకెక్కించాలి అని అనుకుంటున్నారు.

Visitors Are Also Reading