Home » ఒకప్పటి స్టార్ విలన్ ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాడా..? చివరికి డబ్బుల్లేక..!

ఒకప్పటి స్టార్ విలన్ ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాడా..? చివరికి డబ్బుల్లేక..!

by AJAY
Ad

జీవితంలో కష్టాలు ఎప్పుడు ఏ రూపం లో వస్తాయో చెప్పలేం. అప్పటివరకు ఎంతో సంతోషంగా హుందాగా బతికిన వాళ్ల జీవితాలు కూడా సడెన్ గా వచ్చే కష్టాల వల్ల రోడ్డున పడిపోతూ ఉంటాయి. సాధారణ ప్రజలే కాకుండా సినిమా తారలకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపట్టిన పొన్నంభలం పరిస్థితి అదే విధంగా ఉంది. పొన్నం బలం కలియుగం అనే తమిళ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

Advertisement

తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు చేశాడు. టాలీవుడ్ లో చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమాతో పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్ లు అందుకున్నాడు. హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు.

Advertisement

చూడ్డానికి భయంకరంగా కనిపించే పొన్నం బలం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకున్నాడు. సినిమాల్లో ఎంతో గుర్తింపు సాధించిన తర్వాత 2011లో అన్నా డిఎంకె పార్టీలో చేరి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించాడు. అంతేకాకుండా 2017 లో అన్నా డీఎంకే పార్టీని వీడి బిజెపిలో చేరాడు. అయితే అంతా సజావుగా సాగుతుందనుకునే సమయంలో పొన్నం బలం కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరాడు.

అప్పటినుండి అతడి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తాను సంపాదించిన డబ్బంతా ఆస్పత్రి పాలయ్యింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నానని చెబుతూ ఓ వీడియో ద్వారా సెలబ్రిటీలను ఆర్థిక సాయం కోరాడు. దాంతో కమల్ హాసన్ చిరంజీవి లాంటి స్టార్లు అతడికి తమ వంతు సాయం అందించారు. ఇక ప్రస్తుతం అనారోగ్య సమస్యల నుండి కోరుకున్నప్పటికీ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading