రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్ తదితరులు నటించడం జరిగింది. ఈ మూవీ ని జీ స్టూడియోస్ సహకారంతో శ్రీనివాస్ చిట్టూరి పవన్ కుమార్ నిర్మించారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించారు. బోయపాటి శ్రీను సినిమాకి దర్శకత్వం వహించారు. స్కంద సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ రద్దు చేయడంతో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే టాక్ చాలా ముఖ్యం. ఈరోజు ఉదయం నుండి కూడా స్కంద షోలు మొదలయ్యాయి.
Advertisement
అఖండ రేంజ్ లో బోయపాటి స్కంద సినిమాని తీసుకువచ్చారు బ్లాక్ బస్టర్ ని కొట్టేసారు అని చెప్పొచ్చు. మాస్ ప్రేక్షకులను అస్సలు డిసప్పాయింట్ చేయదు. రామ్ నటన, బోయపాటి డైరెక్షన్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. అలానే ఈ సినిమాలో థమన్ అందించిన బిజిఎం కూడా ఒక లెక్కలో ఉంది. అదేవిధంగా ఇంటర్వల్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది అని అంటున్నారు ఆడియన్స్. దీనితో పాటుగా సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్ ని తెప్పించేలా ఉందట. ఇలా ఇవన్నీ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. రామ్ ఫ్యాన్స్ కచ్చితంగా పండగ చేసుకుంటారు.
Advertisement
Also read:
- భార్యాభర్తల మధ్య గొడవలు రాకూదంటే.. వీటిని పక్కా పాటించాలి…!
- బ్లూబెర్రీస్ తో ఈ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టేయండి..!
- Skanda Review : స్కంద సినిమా రివ్యూ.. హీరో రామ్ దుమ్ములేపాడా ?